logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

ఎన్నికలకు భయపడే సీఎం కాదిక్కడ.. ఎమ్మెల్యే రోజా హాట్ కామెంట్స్

ఎన్నికలకు సీఎం జగన్ భయపడరని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ నగరి ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. సీఎం జగన్ దమ్మున్న నాయకుడన్నారు. కేవలం ప్రజలు, ఉద్యోగుల కోసమే ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసే విధంగానే సుప్రీం తీర్పు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

ఒక వేళ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం ఆదేశిస్తే ఎన్నికలకు సిద్దమవుతామన్నారు. చిత్తూరు కలెక్టర్ అహంకారంతో ప్రజాప్రతినిధులను అవమానపరిచారని మండిపడ్డారు రోజా. ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రోజా అనంతరం పంచాయతీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 100 శాతం మంది జగన్ వైపే ఉన్నారన్నారు.

ప్రివిలేజస్ కమిటీ ఉన్నది ఒక్క ప్రతిపక్షాలకు మాత్రమే కాదన్నారు. కాగా ఏపీలో పంచాయతీ ఎన్నికలపై నిన్న ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై సుప్రీం ఎలాంటి తీర్పునిస్తుందోననే విషయం ఉత్కంఠగా మారింది.

Related News