logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ లోకేష్.. ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు

ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి ప్రతిపక్షం పై నిప్పులు చెరిగారు. ఆదివారం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలం పాలన సజావుగా సాగిందని అందుకు దేవుడుకి కృతజ్ఞతలు తెలిపామన్నారు. ఏడాది కాలం లోనే వంద శాతం పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా చికిత్సకు లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్న నేపథ్యంలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చి ఎంతో ఏపీ ప్రజల ప్రాణాలు కాపాడారన్నారు.

ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటికి చంద్రబాబు నాయుడు 100 కోట్లు కూడా ఖజానాలో ఉంచలేదన్నారు. మూడు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారన్నారు. అయినా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులకు అనుగణంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఇలాంటి క్లిష్టమైన సందర్భంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పబట్టారు. కనీసం భోజనం చేసే తీరిక కూడా లేకుండా జగన్ శ్రమిస్తున్నారని లోకేష్ ఏ పనీ లేకుండా ఇంట్లో పబ్జీ ఆడుతున్నాడని అన్నారు.

మంగళగిరి ప్రజలు లోకేష్ కు ఏ విధంగా బుద్ధి చెప్పారో అందరికీ తెలుసన్నారు. మంత్రిగా పని చేసిన లోకేష్ కేవలం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని దద్దమ్మ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉందని ప్రాణ భయంతో పరుగులు పెట్టిన చంద్రబాబు లోకేష్ లు టీడీపీ నేతల అరెస్టులతో ఏపీకి పరుగులు పెట్టి వచ్చారన్నారు.

Related News