logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

దుబ్బాక ఎన్నికలు: హైకోర్టుకు ఎమ్మెల్యే రఘనందన్ రావు

దుబ్బాకలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికైన రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు తనికీలు నిర్వహించగా రఘునందన రావు మామ అంజన్ రావు ఇంట్లో రూ. 18.67లక్షలు పట్టుబడ్డాయని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

కాగా మరో రూ.12.80 లక్షలు రఘునందన్ రావు అనుచరులు ఎత్తుకెళ్లారని వారిని గుర్తించి కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అయినప్పటికీ రఘునందన్ ను గెలుపు వరించింది. తాజాగా సిద్ధిపేట పోలీసులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ రఘునందన్ హై కోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు.

ఎలక్షన్ సమయంలో తమ బంధువుల దగ్గర డబ్బు దొరికినట్టుగా పోలీసులు, రెవెన్యూ అధికారులు కట్టు కథ అల్లారని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా రఘునందన్ దాఖలు చేసిన ఈ పిటీషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు విచారణకు వచ్చింది. అయితే ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈ కేసును సీజేకు బదిలీ చేయాలనీ ఆయన సూచించారు.

Related News