logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

వైఎస్సార్ పై రఘనందన్ వ్యాఖ్యల దుమారం.. వివరణ ఇచ్చుకున్న నేత

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పై బీజేపీ నేత రఘనందన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రఘనందన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు దిగారు వైఎస్సార్ అభిమానులు. దీంతో ఈరోజు రాఘునందన్ తాను చేసిన వ్యాఖ్యల పట్ల సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది.

వైఎస్సార్ లాంటి మహా నాయకుడిని ఆయన కుటుంబాన్ని తానెప్పుడూ కించపరిచి మాట్లాడలేదన్నారు. వారు ప్రవేశపెట్టిన పథకాల పట్ల తాను మాట్లాడిన మాటలను కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు. తన మాటలను వైఎస్సార్ అభిమానులు తప్పుగా అర్థం చేసుకుని బాధపడుతున్నారని అన్నారు. వైఎస్సార్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నాన్నారు.

తన వ్యాఖ్యలను ఎవ్వరూ పొరపాటుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేసారు. కాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ నిన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నేను సైన్స్ టీచర్ని.. ప్రకృతిని నమ్ముతాం. వెనకటి ఒకాయన గిట్లే మాట్లాడి, గట్లే పోయిండు.. పావురాల గుట్టల. నువ్వు కూడా గంతే. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది’ అని అన్నారు. వైఎస్సార్ మరణంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వైఎస్సార్ అభిమానులు రఘనందన్ పై ట్రోలింగ్ కు దిగారు.

Related News