logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

తిరుమల శ్రీవారికి రూ. 23.16 కోట్ల భారీ విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే.. ఎవరంటే?

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమలేశుడికి దేశవ్యాప్తంగా భక్తులున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ భక్తుడు శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేశాడు. అయన అందజేసిన విరాళం విలువ మొత్తం రూ. 23. 16 కోట్లు ఉంటుంది. ఈ మొత్తాన్ని టీటీడీ ఛైర్మెన్ సుబ్బారెడ్డికి అందజేశాడు. అయితే ఈ విరాళాన్ని అందజేసిన భక్తుడు ఎవరో కాదు తమిళ నాడు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు కుమారుగుగూరు.

తమిళ నాడులో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయానికి అన్నాడిఎంకె పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ భారీ విరాళాన్ని ప్రకటించారు. ఉల్లందూర్ పేట నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతను విరాళంగా ఇచ్చిన మొత్తంలో రూ. 3.16 కోట్లు నగదు కాగా.. మిగిలినది ఉల్లందురు పేటలోని 20 కోట్లు విలువ చేసే 4 ఎకరాల స్థలాన్ని శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం రాసిచ్చాడు.

ఈ మొత్తం విలువ కలిపి 23. 16 కోట్లుగా ఉంది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. త్వరలనే కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని అన్నారు. ఆలయ నిర్మాణాల కోసం టీటీడీ ఇప్పటికే చర్యలు చేపట్టిందని వెల్లడించారు. కాగా తిరుమలలో ఇప్పుడిప్పుడే భక్తుల రద్దీ పెరుగుతుంది. తాజాగా శ్రీ వారి హుండీ ఆదాయం 3. 15 కోట్లకు చేరింది.

Related News