logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

‘కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి..?’

టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ పై గత కొంతకాలంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారని దీని సారాంశం. ఇటీవల దీనిపై ఓ పత్రికలో కథనాలు కూడా వెలువడ్డాయి. టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా దీనిపైనే జోరుగా చర్చ నడుస్తున్నట్టుగా సమాచారం. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వీటికి మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.

ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న అనంతరం దానం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటని దానం ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో ముందుందని అన్నారు. కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే హెచ్చరించారని తెలిపారు.

వాక్సిన్ రాకతో ఈ మహమ్మారి వదిలి ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. డిసెంబర్ నాటికి కరోనా పూర్తిగా అంతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. అదే విధంగా కరోనా వేళ ఖైరతాబాద్ లో 10 అడుగుల వినాయక విగ్రహం ఏర్పాటుకు అనుమతినిచ్చినందుకు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాతో పోరాడుతున్న ప్రజలపై భగవంతుడి ఆశీస్సులు ఉండాలని దేవుడిని ప్రార్థించినట్టుగా పేర్కొన్నారు.

Related News