logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

సీఎం జగన్ కు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లేఖ..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ లేఖ రాశారు. హిందూపురం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాలకృష్ణ సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజలతో పాటుగా రాయలసీమ ప్రాంత విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు.

అయితే తమ జిల్లాలోని మలుగురు గ్రామంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించామని ఈ విషయాన్నీ ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఈ ప్రాంతంలో కాలేజీ నిర్మాణానికి అనువైన ప్రాంతం అన్నారు. అందుకోసం మలుగురు గ్రామంలో 52 ఎకరాల భూమి ఉందన్నారు. దానితో పాటుగా వివిధ కాలేజీలు, విద్యాసంస్థలు ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయని విద్యార్థులకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని లేఖలో తెలిపారు.

మరో లేఖ ద్వారా ఒక వేళ జిల్లాల పునర్విభజన జరిగితే.. హిందూపురంకు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనీ కోరారు. ఈ విషయాన్నీ సీఎం జగన్ కు లేఖలో తెలుపుతూ ఏపీ సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి కూడా ఫ్యాక్స్ ద్వారా లేఖలను పంపించారు.

Related News