logo

  BREAKING NEWS

ఆకతాయిల వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పయింది. చిత్తూరు జిల్లా పీలేరులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బండ్ల వీధికి చెందిన విజయ లక్ష్మిని అదే ప్రాంతానికి చెందిన కొందరు యువకులు వేధించసాగారు. ఈ క్రమంలో సోమవారం రోజున బాలిక వెంటపడ్డ ఆకతాయిలు ఆమె ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నా వదల లేదు.

దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను వేధించిన యువకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News