కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా వైరస్ ను కట్టడి చేయలేక పోతుంది. కేంద్రం విధించిన లాక్ డౌన్ పై కొన్ని సడలింపులు ఇవ్వడంతో ప్రజలు భారీగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రోజుకు దాదాపు 150 కొత్త కేసులు నమోదవుతున్నాయి.
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు టీఎసుకున్న వైరస్ ను కట్టడి చేయలేకపోతోంది. దీంతో కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. ముఖంగా హైదరాబాద్ పరిధిలో భారీగా కేసులు నమోదవ్యుతున్నాయి. ఈసీనేపథ్యంలో హైదరాబాద్ లో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను విధిస్తారని ప్రచారం ఊపందుకుంది.
ఈ విషయమై తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. నగరంలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్ళీ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నగరంలో లాక్ డౌన్ విధించాలా వద్దా అనే విషయంపై ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారన్నారు. ఈ విషయాన్నీ మరో రెండు మూడు రోజుల్లో ఆయనే స్వయంగా వెల్లడిస్తారన్నారు. ప్రజలు లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.