తెలంగాణలోని విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త వినిపించారు. కరోనా కారణంగా పాఠశాలలు మూతబడిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠశాలలను ప్రారంభించారు. తాజాగా 6, 7, 8 తరగతులకు కూడా తరగతులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 24 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే పాఠశాలలలో కోవిడ్ నిబంధనలను పాటించాలని పేర్కొంది ప్రభుత్వం. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. అయినా పొరుగు రాష్ట్రల్లో మరోసారి కరోనా సైరన్ మోగుతుంది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు వచ్చే విద్యార్థులు కరోనా నిబంధనలను పాటించడం తప్పనిసరిగా అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.