logo

  BREAKING NEWS

‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |  

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా!

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మంగళవారం ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా తేలిందన్నారు. ప్రస్తతం హోమ్ ఐసోలేషన్ లో ఉండి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. తనను కలిసిన వారంతా క్వారెంటైన్ లో ఉండాలని, కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. కరోనా సోకినా తన ఆరోగ్యం బాగానే ఉందని స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వివరించారు.

సోమవారం ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో భాగంగా తనకు కరోనా పాజిటివ్ గా తేలిందన్నారు. కాగా ఈ విషయం తెలిసి తనపై ప్రేమ అభిమానులతో తనకు ఫోన్ చేస్తున్నవారందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తన ఆరోగ్యం పట్ల కార్యకర్తలు, అభిమానులు, నాయకులూ ఆందోళన చెందవద్దని అయన సూచించారు.

తానిప్పుడు హైదరాబాద్ మినిష్టర్ క్వార్టర్స్ లో హోమ్ ఐసోలేషన్ ఉన్నట్టుగా తెలిపారు.దయచేసి నన్ను కలుసుకోవడానికి గాని, ఫోన్ చేయడానికి గాని ప్రయత్నించవద్దని మంత్రి కోరారు. త్వరలోనే తాను సాధారణ స్థితికి వస్తానని యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు.

Related News