logo

  BREAKING NEWS

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |  

వైసీపీ నేత హత్య.. మృతదేహం వద్ద విలపించిన మంత్రి పేర్ని నాని

మచిలీపట్నంలో వైసీపీ నేత, మార్కెట్ యార్డు చైర్మెన్ మోకా భాస్కర రావు మృతదేహానికి ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నివాళులు అర్పించారు. భాస్కరరావు చాలా కాలంగా పేర్ని నానికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. భాస్కరరావు మృతదేహాన్ని చూసిన వెంటనే పేర్ని నాని భావోద్వేగానికి గురయ్యారు. నివాళులు అర్పిస్తూ మృతదేహం వద్ద విలపించారు.

కాగా మున్సిపల్‌ చేపల మార్కెట్‌లో ఉన్న భాస్కర్‌రావును ఇద్దరు దుండగులు సైనేడ్ పూసిన కత్తితో పొడిచి హత్య చేసారు. కత్తి నేరుగా గుండెల్లోకి దిగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పేర్ని నాని హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. భాస్కరరావు కుటంబాన్ని ఓదార్చారు.

ఆయన కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాగా పాత కక్షలే ఈ హత్యకు కారణమని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భాస్కరరావు హత్యతో వైసీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Related News