ప్రతిపక్ష నేత చంద్రబాబు నిరసన కేవలం రాజకీయ డ్రామానే అని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం బాబుకు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలెవరూ పటించుకోవడం లేదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు బాబు కుట్ర పన్నుతున్నారన్నారు. బాబు హయాంలో విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ ను అడ్డుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. చంద్రబాబును ఎవరూ ఇబ్బంది పెట్టడం లేదన్నారు.
చిత్తూరులో దీక్ష చేసేందుకు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి రేణి గుంట ఎయిర్ పోర్టుకు బాబు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులోనే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం, కరోనా నిబంధనల కారణంగా నిరసనలకు, ప్రదర్శనలను అనుమతులు లేవంటి వారు స్పష్టం చేయడంతో చంద్రబాబు అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. గత 7 గంటలుగా బాబు నేలపైనే బైఠాయించారు.