నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపై జారీ చేసిన ఆదేశాలపై తాజాగా మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ఒక మంత్రిని ఇంట్లో నిర్బంధించాలనడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. తనపై ఎన్నికల కమిషనర్ ఇలాంటి ఆదేశాలు ఇస్తారని తాను ముందే ఊహించానని చెప్పిన పెద్దిరెడ్డి.. నా మీద ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయో లేదో ముందు చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు.
నిమ్మగడ్డకు ఇంగిత జ్ఞానం లేదని ఆయనొక మ్యాడ్ ఫెలో అంటూ విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ ఆదేశాలను ఖాతరు చేసేది లేదని స్పష్టం చేసారు. నిమ్మగడ్డ ఆదేశాలను పాటించి ఏకపక్షంగా వ్యవహరిస్తే ఆ అధికారులపై చర్యలు తప్పవంటూ మరోసారి హెచ్చరించారు. అలాగే నిమ్మగడ్డలాగే టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులపైనా భవిష్యత్తులో తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు.