logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

మ‌ళ్లీ గెలిచిన కేటీఆర్‌… ఈసారి కూడా ఏక‌గ్రీవంగానే..!

తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు తెలంగాణ బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా మ‌రోసారి ఏక‌గ్రీవంగా విజ‌యం సాధించారు. ఇప్ప‌టికే ఆయ‌న అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. ప‌ద‌వీకాలం ముగియ‌డంతో తాజాగా హైద‌రాబాద్ ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని ఎఫ్ఎన్‌సీసీ క్ల‌బ్‌లో ఎన్నిక‌లు జ‌రిపారు. అధ్య‌క్ష స్థానానికి కేటీఆర్‌పైన ఎవ‌రూ పోటీ చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ను ఎక‌గ్రీవంగా ఎన్నుకున్న‌ట్లు బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ప్ర‌క‌టించింది.

కాగా, బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బ్యాడ్మింట‌న్ దిగ్గ‌జ ఆట‌గాడు పుల్లెల గోపీచంద్ ఎన్నిక‌య్యారు. అసోసియేష‌న్ సీనియ‌ర్ వైస్ ప్ర‌సిడెంట్‌గా యుగంధ‌ర్ రావు, వైస్ ప్ర‌సిడెంట్‌గా చాముండేశ్వ‌రీనాథ్‌, కోశాధికారిగా పాణీరావు ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో బ్యాడ్మింట‌న్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తామ‌ని, దేశానికి మ‌రింత మంది మెరుగైన క్రీడాకారుల‌ను తెలంగాణ నుంచి పంపిస్తామ‌ని కొత్త క‌మిటీ స‌భ్యులు పేర్కొన్నారు.

Related News
%d bloggers like this: