logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఎన్టీఆర్ ఫాన్స్ తో మీరా చోప్రా వివాదంపై స్పందించిన కేటీఆర్

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో హీరోయిన్ మీరా చోప్రా వివాదం ముదురుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన తర్వాత కూడా వేల సంఖ్యలో ఆమెకు అసభ్య మెసేజిలను పంపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. తనకు ఎదురవుతున్న వేధింపులపై స్పందించాలని ఆమె ఆయా రాష్ట్ర నేతలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యంమత్రి వైఎస్ జగన్, మహిళా శిశు సంక్షేమ మంత్రి తానేటి వనితను టాగ్ చేస్తూ తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపిన విషయం తెలియందే.

హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సమయంలో ఆమె తెలంగాణ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితను కూడా ఈ విషయమై ట్విట్టర్ లో టాగ్ చేసారు. మీ రాష్ట్రానికి చెందిన వారు నన్ను గ్యాంగ్ రేప్ చేస్తామని, ఆసిడ్ పోస్తామని బెదిరిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు దీనిపై కేసు ఫైల్ చేసారు. ఆడవారికి భద్రత కల్పించాలని కోరుతున్నాను అని ఆమె ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసారు.

తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘మేడం తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ పోలీసులను నేను కోరాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేసారు. అందుకు మీరా రిప్లై ఇస్తూ.. ‘థాంక్యూ సార్ ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారిని వదలద్దు’ అంటూ ట్వీట్ చేసారు. రాను రాను ఈ వ్యవహారం ఇంకా ఎంతదూరం వెళుతుందో చూడాలి.

Related News