logo

  BREAKING NEWS

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!  |  

దేశంలో తెలంగాణ ఉన్నట్టా? లేనట్టా?.. కేటీఆర్ ఫైర్..

వరద బాధితుల విరాళాలపై పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అయి విమర్శలపై మంత్రి కేటీఆర్ విపక్షాలపై మండిపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి వరద సహాయం చేశామని అందుకు సంబందించిన పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయన్నారు.

బాధితులకు తక్షణ సహాయం చేయాలనుకున్న తమపై ప్రతిపక్షాలు బురద రాజకీయాలకు తెరలేపాయన్నారు. దీనిని అదునుగా తీసుకుని దుబ్బాకలో ఓట్ల కోసం ప్రయత్నాలు చేశాయంటూ విమర్శించారు. కేంద్రం గుజరాత్, కర్ణాటకకు సహాయం చేసింది గాని తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. అసలు కేంద్రం దృష్టిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో లేదా అని ప్రశ్నించారు.

బీజేపీలో నలుగురు ఎంపీలు ఉంటె ఒక్కరు కూడా ఈ విషయంపై ఎందుకు స్పందించరని అన్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తుంది బీజేపీనే అన్నారు. అర్హులైన ప్రతి ఒకరికి ఇంటింటికీ వచ్చి విరాళాలు అందిస్తామన్నారు. ప్రజలెవరూ ఆందోళనలు, ధర్నాలు చేయవద్దన్నారు.

అవసరమైతే ముఖ్యమంత్రిని ఇంకో రూ.100 కోట్లు అడుగుతామన్నారు. .చెరువులు, నాళాల కబ్జాలు దశాబ్దాలుగా జరిగాయని పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం కూడా చూపిస్తామని హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డి సహాయక మంత్రా? నిస్సహాయక మంత్రా సమాధానం చెప్పాలి. పంట నష్టం పై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామన్నారు కేటీఆర్.

Related News