ఆరేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది? జన్ ధన్ ఖాతాల్లో రూ. 15 లక్షలు ఎంతమందికి పడ్డాయని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా సనత్ నగర్, గోషామహల్ లో కేటీఆర్ రోడ్ షో నిర్బహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ వేశారు.
ఐటీఐఆర్ ను రద్దు చేసిన వారు హైదరాబాద్ ను ఐటీ హబ్ గా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు ఉత్తి చేతులతో వచ్చారని ఎద్దేవా చేసారు. వరదలు వచ్చిన సమయంలో మంత్రులు, నేను కలిసి నగరమంతా పర్యటించాం. వరద సాయం చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే దానిని అడ్డుకున్నారన్నారు.
నగరంలో 6 లక్షల 46 వేల మంది బాధితులకు వరద సహాయాన్ని అందజేశామన్నారు. మాది నిజాం సంస్కృతి కాదు అమిత్ షా గారు. గడిచిన ఆరేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం హైదరాబాద్ కు ఏమిచ్చిందో చెప్పాలన్నారు.