logo

  BREAKING NEWS

ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |   ప్రధాని మోదీ వేయించుకున్న వాక్సిన్ ఏదో తెలుసా?  |   శ‌భాష్‌ జ‌గ‌న్‌.. ఈ ఒక్క నిర్ణ‌యంతో మ‌రో మెట్టు ఎక్కేశావు  |   పెట్రోల్ పంపులో మ‌న‌కు ఇవ‌న్నీ ఉచితంగా ఇవ్వాల్సిందే  |   శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. 26-02-2021 బంగారం ధ‌ర‌లు  |   నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా ఫట్టా?  |   బ్రేకింగ్: ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా కేసులో యువతి ఆత్మహత్య!  |   కుప్పంలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. షాకివ్వనున్న కీలక నేతలు!  |  

లోకేష్ సర్పంచ్ గా గెలిస్తే రాష్ట్రం వదిలిపోతా.. కొడాలి నాని సవాల్!

నారా లోకేష్ పై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రోజున అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి గెలిస్తే రాష్ట్రం వదిలి పోతానంటూ ఛాలెంజ్ చేశారు. మూడు శాఖలకు మంత్రిగా పనిచేసిన లోకేష్ మంగళగిరి ఎన్నికల్లో గెలవలేకపోయారని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే దమ్ము నారా లోకేష్ కు లేదని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా నుంచి సర్పంచ్ గా గెలిచి చూపించాలని సవాల్ చేశారు.

చంద్రబాబును భుజాలెకేతుకున్న నాయకులందరికీ ప్రజలే బుద్ధి చెప్తున్నారన్నారు.. పంచాయతీ ఎన్నికల్లో మొదటి రౌండ్ ఫలితాలు చూసి చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా ప్రతిపక్షాలు దానిని విమర్శిస్తున్నాయంటూ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తే తాను స్టీల్ ప్లాంట్ సమస్యపై పోరాడతానని కొడాలి నాని ప్రకటించారు.

రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చంద్రబాబు కేంద్రమంత్రి అమిత్ షా, రామ్ నాథ్ కోవింద్ లకు లేక రాయడంపై కొడాలి నాని సెటైర్లువేశారు . రెండో విడత ఎన్నికలు ముగిసిన వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఐక్యరాజ్యసమితికి కూడా బాబు లేఖ రాస్తారని అన్నారు. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. బాబుకు ఏం జరిగిందో తాను చెప్పలేనని నిమ్మగడ్డను, చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే వారే చెప్తారంటూ వ్యాఖ్యలు చేశారు.

Related News