logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

న‌న్ను డ్రైవ‌ర్ అంటాడా… కంచిక‌చ‌ర్ల క్రాంతి సోడా దుకాణం వారిదే

రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబుకు అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని మంత్రి కొడాలి నాని ప్ర‌శ్నించారు. ఆనాడు వైయస్‌ఆర్‌ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని అంటే, కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటూ అవహేళనగా చంద్రబాబు మాట్లాడిన విషయం గుర్తులేదా..? అని అడిగారు. ఇవాళ ఆయ‌న అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు వైయస్‌ఆర్‌ తనయుడు జగన్ రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను వ్యవస్థీకృతం చేసేందుకు కృషి చేస్తుంటే, దానిపైన చంద్రబాబు విషం చిమ్ముతున్నాడన్నారు. మనం ఉన్నా, లేకపోయినా రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ ఒక పద్దతి ప్రకారం నిరంతరం అందాలన్న లక్ష్యంతో జ‌గ‌న్‌ ముందుకు సాగుతున్నారని తెలిపారు.

రైతుల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే 30 నుంచి 35 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఎలాంటి ఢోకా రానివ్వకుండా 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్ ‌కోసం ప్రయత్నాలు ప్రారంభించామ‌న్నారు. తద్వారా యూనిట్‌ కరెంటు రూ.2.5లకే ప్రభుత్వానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇప్పటి వరకు రైతులకు అందిస్తున్న విద్యుత్‌ కోసం యూనిట్‌ రూ.6 వరకు చెల్లిస్తున్నామ‌న్నారు. ఏడాదికి దాదాపు రూ.8వేల కోట్లకుపైగా ఉచిత విద్యుత్తు కోసం ఖర్చు అవుతుందని, దీనికయ్యే పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఫలితంగా ప్రభుత్వంపై ప్రస్తుతం చెల్లిస్తున్న దానిలో సగం వరకు భారం తగ్గుతుందన్నారు. రైతులు, డిస్కమ్‌, ప్రభుత్వం ఒక అగ్రిమెంట్‌తో ప్రతినెలా రైతు కనెక్షన్‌కు మీటరు పెట్టి ఎంత కరెంట్ వాడుకున్నాడో ఆ బిల్లును ప్రభుత్వమే డిస్కమ్‌లకు చెల్లిస్తుందని తెలిపారు. ఒక్క రూపాయి కూడా రైతు చెల్లించాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేశారు.

ఈ విధానం అమలులోకి వస్తే ప్రతిరోజూ పగటి పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ రైతుకు అందుతుందన్నారు. దీనికోసం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఒక పైలెట్ ప్రాజెక్ట్‌ను కూడా చేపట్టిన‌ట్లు తెలిపారు. ఏప్రిల్ లోపు దానిని పూర్తి చేసి, రైతులకు చేరువ చేస్తామ‌న్నారు. దాని నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌తో రాష్ట్రం అంతా కూడా దానిని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. రైతుల గురించి జగన్ ఇంత‌గా ఆలోచిస్తుంటే, చంద్రబాబు దీనిపైన కూడా బురదజల్లుతున్నాడు. తాను అధికారం నుంచి వెళ్ళిపోయే సమయంలో ఎనిమిది వేల కోట్లు రైతులకు విద్యుత్ బకాయిలు పెట్టి వెళ్లిన ప్రబుద్ధుడు చంద్రబాబు అని ఆరోపించారు.

ఇలాగే ప్రతిసారీ అధికారం మారినప్పుడల్లా డిస్కమ్‌లకు వేల కోట్లు రైతుల విద్యుత్‌ బకాయిలు పెట్టిపోతే, డిస్కమ్‌లు ఆర్థికంగా కుదేలైతే, అంతిమంగా రైతులే నష్టపోతార‌న్నారు. దీనిని పూర్తిగా సరిదిద్దేందుకు, శాశ్వతంగా రైతులకు అందే విద్యుత్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా వుండాలనే సీఎం జగన్ కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో జరిగే ఈ మంచిని చంద్రబాబు సహించలేక, తనకు బాకా ఊదే మీడియాల ద్వారా రైతులకు నష్టం జరిగిపోతోందనే అసత్య ప్రచారం చేయిస్తున్నాడ‌ని ఆరోపించారు. చంద్రబాబు ఒక దళారీ, బ్రోకర్. హెరిటేజ్ పేరుతో పేడ, పాలు, పెరుగు అమ్ముకోవడంతో పాటు రైతులు పండించిన వాటిని కూడా తక్కువ ధరకు కొని, హెరిటేజ్ బ్రాండ్ పేరుతో ఎక్కువకు అమ్మకుంటున్న బ్రోకర్ అని విమ‌ర్శించారు.

నిన్న సీఎం వైయస్‌ జగన్ ను చంద్రబాబు హెచ్చరించడం హాస్యాస్పదంగా వుందని, అచ్చెన్నాయుడిని హింసించారంటూ చంద్రబాబు వాపోతున్నార‌ని, అసలు అచ్చెన్నాయుడిని ఎవరైనా హింసించగలరా? అని ప్ర‌శ్నించారు. కార్మికులకు ఇవ్వాల్సిన మందుల విషయంలో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడి, అరెస్ట్ అయ్యార‌న్నారు. ఆయన ఇప్పటి వరకు 78 రోజులు కస్టడీలో వుంటే, అందులో ఫైల్స్ చికిత్స పేరుతో 70 రోజులు ఆసుపత్రిలోనే వున్నాడు. కేవలం ఆరేడు రోజులు మాత్రమే ఆయన జైలులో వున్నార‌న్నారు. ఈ భూప్రపంచంలో ఫైల్స్ చికిత్సకు 70 రోజులు ఆసుపత్రిలో ఎవరైనా వుంటారా? అని అన్నారు. తాము చాలా సహనంతో వ్యవహరించామ‌ని, అచ్చెన్నాయుడు గురించి సీఎం జగన్ అసలు పట్టించుకోరన్నారు.

చంద్రబాబు తాను అధికారంలోకి వస్తానని కలలు కంటున్నార‌ని, ఇప్పటికే 76 ఏళ్ళ వయస్సున్న చంద్రబాబు ఎన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేయగలడని, ఎన్నిసార్లు మళ్లీ అధికారంలోకి రాగలడని ప్ర‌శ్నించారు. విజయవాడకు వచ్చినా కూడా కరోనా భయంతో అంతరిక్షం నుంచి వచ్చినట్లుగా చంద్రబాబు అవతారం వుందన్నారు. దోమలపై దండయాత్ర చేసిన చంద్రబాబు కరోనాపై ఎందుకు దండయాత్ర చేయడం లేదు? హుద్‌హుద్ కు ఎదురెళ్ళానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కరోనాకు ఎందుకు ఎదురెళ్లడం లేదు? అని ప్ర‌శ్నించారు.

దేవినేని ఉమ అక్కాయ్ కబుర్లు చెబుతున్నార‌ని, తాను మైసూర్ మహారాజులాగా, అంతరిక్షం నుంచి ఇప్పుడే భూమిపైకి దిగివచ్చినట్లు మాట్లాడుతున్నార‌ని, కంచికచర్లలో క్రాంతి కూల్ డ్రింక్‌ పేరుతో దేవినేని తండ్రి సోడాలు అమ్ముకునేవార‌న్నారు. తండ్రి కొట్టిన సోడా కాయలను దేవినేని ఉమ కడిగేవార‌న్నారు. అటువంటి దేవినేని ఉమ త‌నను లారీ డ్రైవర్, క్లీనర్‌ గా పనిచేశానని అంటున్నార‌ని, గుడివాడలో త‌మ‌కు వందకు పైగా సొంత లారీలు, బస్సులు ఉండేవ‌న్నారు. పదేపదే లారీ డ్రైవర్, క్లీనర్ అంటూ వారిని తక్కువచేసేలా దేవినేని ఉమ మాట్లాడితే లారీ డ్రైవర్లు, క్లీనర్లు సహించరన్నారు.

త‌న‌కు రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆర్, వైయస్‌ఆర్‌ కుటుంబాలని, ఆ కుటుంబాలకు తాను విధేయుడిగా వుంటాన‌ని పేర్కొన్నారు. అంతేకానీ చంద్రబాబు వద్ద చేతులు కట్టుకుని వుండాల్సిన అవసరం త‌న‌కు లేద‌న్నారు. చంద్రబాబుకే ఇందిరా గాంధీ, ఎన్టీఆర్‌లు రాజకీయ బిక్ష పెట్టారన్నారు. అధికారం కోసం చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌ను చంపితే, దేవినేని ఉమ తన వదినను చంపి రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. అటువంటి వారి వద్ద తాను రాజకీయాలు నేర్చుకోవాలా? అని ప్ర‌శ్నించారు.

Related News