తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కళను తీర్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తుందన్నారు. అర్హులైనవారు మాత్రమే ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని హరీష్ రావు అన్నారు. లేదంటే మరొకరికి అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు.
ఇలా ఇల్లు పొందిన వారు వాటిని అమ్మడం కొనడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరించి ఇళ్ల పంపిణీ చేస్తుందన్నారు. ఇళ్ల పంపిణీలో కొంత మంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఈ సందర్భంగా హరీష్ రావు స్పందించారు. తనను విమర్శించిన బీజేపీ నేతకు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చిందన్నారు.
ఇళ్ల లబ్దిదారులు ఎవరైనా రూపాయి లంచం ఇచ్చినట్టు నిరూపిస్తే వారికి రూ.10 వేలు బహుమానంగా ఇస్తామని ఛాలెంజ్ చేసారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసిఆర్ ప్రభత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. లబ్ధిదారులు కేసీఆర్ పేరు నిలబెట్టాలని హరీష్ రావు వ్యాఖ్యానించారు.