logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

దుబ్బాక ఉపఎన్నిక: బండి సంజయ్ కు మరో సవాల్ విసిరిన హరీష్..

దుబ్బాకలో ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ బీజేపీలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు మరోసారి బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తోట కమలాకర్ రెడ్డి ఆదివారం హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటుగా ఆయన అనుచరులు మరికొందరు గ్రామ స్థాయిలోని కాంగ్రెస్ నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన ప్రాజెక్టులను రద్దు చేసి కేంద్రం ఇప్పటికే తీరని అన్యాయం చేసిందన్నారు. బహిరంగ లేఖ రాస్తూ 18 ప్రశ్నలకు జవాబు చెప్పి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాలు విసిరారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసారు. అందులో అసలు బీజేపీకి నైతిక విలువలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమాత్రం సహకరించకపోగా 7 రాష్ట్రాలను ఆంధ్రాలో కలపడం అన్యాయం కాదా?. సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాలో కలపడం ద్వారా ఏటా 500 కోట్ల నష్టం మీ వల్ల కాదా?. తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు బీజేపీ ప్రభుత్వం గడిచిన ఆరేళ్లుగా అన్యాయం చేస్తూనే వస్తుంది. కేంద్రం తెలంగాణ రాష్ట్రం పై సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది.

అసలు మీకు ఇక్కడి ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు ఉందా? తెలంగాణ ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలి? మీ పొట్ట కొడుతూనే ఉంటాం కానీ మీరు మా పల్లకి మోయాలి అనే వైఖరి బీజేపీ చూపుతుంది. బీజేపీ వ్యక్తిగత దూషణలు, ఘర్షణలకు పాల్పడుతోందన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా వివక్ష చూపారు.

బయ్యారం, ఐటీఐఆర్ రద్దు చేసింది మీరు కాదా? స్వయంగా ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్న నీతి ఆయోగ్ తెలంగాణకు మొత్తం 24 కోట్ల రూపాయలను ఇవ్వాలని సిఫారసు చేసినా ఇప్పటివరకు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథను స్వయంగా ప్రధాన మంత్రి ప్రారంభించారు అయినా నీతి ఆయోగ్ సిఫారసులను అమలు చేయలేదు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే విధానం మీది కాదా?.

తెలంగాణ రాష్ట్రానికి 3,155 కిలో మీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించిన కేంద్రం 1,300 కిలోమీటర్లకు మాత్రమే నిధులను విడుదల చేసింది. మంజూరు చేసిన జాతీయ రహదారులకు నిధులు నిలిపివేయడం తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం కాదా?

తెలంగాణ రాష్ట్రం ఇచ్చే 2,016 రూపాయల పెన్షన్ లో 1600 కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది అని అబద్దాలు అడినారు. నిరూపించమంటే పారిపోయారు. పెన్షన్లలో మీ వాటా కేవలం 200 రూపాయలు మాత్రమే. అది కూడా కొద్దీ మందికే ఇస్తున్నారు. దేశంలోని టెక్స్ టైల్స్ పార్కులకు సాయం చేసే కేంద్రం వరంగల్ టెక్స్ టైల్స్ పార్కుకు మాత్రం ఎందుకు సహాయం చేయదు?

ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్లలో అన్యాయం చేయలేదా? తెలంగాణకు నవోదయ విద్యాలయాలు ఎందుకు ఇవ్వడం లేదు? గంగా, నర్మదా నదులను ప్రక్షాళన చేస్తున్న కేంద్రం మూసి ప్రక్షాళనకు మాత్రం నిధులను ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ రాష్ట్రం పై బండి సంజయ్ కు చిత్తశుద్ధి ఉంటె రాష్ట్రానికి రావలసినవి కేంద్రం నుంచి తీసుకువచ్చి నిరూపించుకోవాలంటూ బహిరంగ లేఖ ద్వారా సవాలు విసిరారు.

 

Related News