logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

తెలంగాణ ఉద్యోగులకు మంత్రి హరీష్ రావు శుభవార్త!

కరోనా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో కోత విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లేకపోవడంతో నిధులు కాళీ అయ్యాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలలో కోత విధించింది ప్రభుత్వం. కాగా ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి.

ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, పబ్లిక్ సెక్టార్, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు ఐక్య వేదిక తరపున తెలంగాణ మంత్రి హరీష్ రావు ను కలిశారు. తాము ఎదుర్కుంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. హరీష్ రావు వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ.. జూన్ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలను చెల్లించేందుకు అంగీకరించారు.

ఈ విషయాన్ని ఐక్య వేదిక ప్రతి నిధులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఉద్యోగులకు పూర్తి వేతనాలతో పాటుగా రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పెన్షన్లు చెల్లించనున్నట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల వేతన బకాయిలను జీపిఎఫ్ విధానం ద్వారా కాకుండా నగదు రూపంలో చెల్లించాలని మంత్రి హరీష్ రావు ను కోరామన్నారు.

Related News