logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

రాహుల్ సిప్లిగంజ్ కు మంత్రి హరీష్ రావు ఆఫర్

ప్లే బ్యాక్ సింగర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టిన రాహుల్ సిప్లిగంజ్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో భారీగా మాస్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ గెలుచుకోవడంతో రాహుల్ మరింత ఫేమస్ అయిపోయాడు. ఈ షోతో వచ్చిన ఫాలోయింగ్ తో హీరోగా నటించే ఛాన్స్ కొట్టేసాడు. కృష్ణవంశీ లాంటి బడా డైరెక్టర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్ లోకి అడుగు పెట్టాడు రాహుల్.

‘ఊకో కాక’ అనే మెన్స్ క్లాతింగ్ బ్రాండ్ ను నగరం నలుమూలలా విస్తరింపజేస్తున్నాడు. తాజాగా సిద్దిపేటలో కొత్త బ్రాంచ్ ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్థిక మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును ముఖ్య అతిధిగా ఆహ్వానించాడు. ఆయన చేతుల మీదగా షోరూం ను ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో తన కొత్త సినిమా సాంగ్ ను, టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేయించాడు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాహుల్ సిప్లిగంజ్ ను అభినందించారు.

తన సినిమాకు ‘చిచ్చా’ అనే టైటిల్ ను పెట్టడం తెలంగాణ బ్రాండ్ ను ప్రమోట్ చేసేలా ఉందని ప్రశంసించారు. రాహుల్ మన తెలంగాణ బిడ్డ ఈ సినిమా మంచి హిట్టవ్వాలి. నీ మొదటి సినిమాకు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తా అంటూ ఆఫర్ ఇచ్చారు. అంతే కాదు బిగ్ బాస్ షో ఏ విధంగా హిట్ చేసాడో ఈ సినిమా కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకోవాలని కోరారు. తెలుగు సినీ పరిశ్రమలో రాహుల్ సూపర్ స్టార్ రేంజ్ కు ఎదగాలంటూ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.

ఇక చిచ్చా అంటూ రాహుల్ సిప్లిగంజ్ చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్, సాంగ్ రెండూ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . ఆర్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్‌పై రాబోతోన్న ఈ మూవీని మల్లిక్ కందుకూరి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

 

Related News