logo

  BREAKING NEWS

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |   అసెంబ్లీలో రగడ: చంద్రబాబు సహా టీడీపీ సభ్యుల సస్పెండ్!  |   కరోనా పుట్టింది ఎక్కడో కాదు భారత్ లోనే..? చైనా సంచలన ఆరోపణలు!  |   అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |  

కానిస్టేబుల్ బాబ్జిపై మంత్రి హరీష్ రావు ట్వీట్

ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో అంబులెన్స్ కు దారి చూపి రోగి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ బాబ్జి ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో వైరల్ కావడంతో తాజాగా దీనిపై మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు. కానిస్టేబుల్ బాబ్జిని అభినందించారు.

”మానవత్వం పరిమళించే మంచి మనుషుల్ని చూసినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కాపాడటం కోసం హైదరాబాద్ అబిడ్స్ లో కానిస్టేబుల్ బాబ్జీ పడిన తపన చూసినప్పుడు అంతే సంతోషం వేసింది.” అంటూ ట్వీట్ చేసారు. నగరంలో ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో అబిడ్స్ ఒకటి. నిన్న అబిడ్స్ జీపీవో లో ట్రాఫిక్ లో చిక్కుకున్న ఓ ఆంబులెన్స్ కోసం ట్రాఫిక్ పోలీస్ బాబ్జి రంగంలోకి దిగారు.

అంబులెన్స్ కోసం దారి ఇవ్వాలంటూ రోడ్డుపై పరుగులు పెడుతూ వాహనాలను అప్రమత్తం చేశారు. దీంతో సరైన సమయంలో అంబులెన్స్ ను ఆసుపత్రికి తరలించగలిగారు. అయితే దీనిపై స్పందించిన బాబ్జి తాను ఇదంతా తన విధి నిర్వహణలో భాగంగానే చేశానంటూ చెప్పాడు. బాబ్జిపై సామాన్య ప్రజలతో పాటు ఉన్నతాధికారులు కూడా ప్రసంశలు కురిపిస్తున్నారు. తాను చేసిన చిన్న పనికి ఇంతలా ఆదరణ రావడం తనకెంతో సంతోషమని కానిస్టేబుల్ బాబ్జి పేర్కొన్నాడు.

Related News