logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

కరోనా వాక్సిన్ పై మంత్రి ఈటెల కీలక వ్యాఖ్యలు!

కరోనా వాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తున్నా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో వాక్సిన్ పై ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు. కాగా తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరోనా వాక్సిన్ పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు.

కరోనా వాక్సిన్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని ప్రశ్నించగా.. వాక్సిన్ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రిని అడిగామని కానీ వారు సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పి షాకిచ్చారు. వాక్సిన్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఈ వార్త నిజంగానే ఆందోళనకు గురి చేసేదిగా ఉంది.

అయితే వాక్సిన్ కు సంబందించిన ప్రొటొకాల్స్ ను పూర్తి చేస్తున్నామని వాక్సిన్ వస్తే ముందుగా ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బందికి ఆ తర్వాత శానిటైజేషన్ సిబ్బందికి ఇస్తామని అన్నారు. అదే విధంగా బస్తీల్లోని ప్రజలకు కూడా వాక్సిన్ ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు ప్రారంభించేందుకు మంత్రి ఈటెల స్థానిక ఎమ్మెల్యేతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా కరోనా వాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసారు.

Related News