logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

నిలువు దోపిడీ ఆపండి.. ప్రైవేటు ఆసుపత్రులకు మంత్రి ఈటెల స్ట్రాంగ్ వార్నింగ్..!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ, చికిత్స తదితర విషయాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా బాధితుల పట్ల ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై ఈటెల మరోసారి మండిపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రులు పద్దతిని మార్చుకోకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదన్నారు. గతంలోలాగా రోగుల దగ్గర నుండి డబ్బులు దండుకోవడమే ప్రధాన లక్ష్యంగా ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికే ఒక ఆసుపత్రిపై ప్రభుత్వం వేటు వేసింది. ఇకమీదట కూడా ఇలాగే వ్యవహరిస్తే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కరోనా బాధితుడి వద్ద డబ్బులు లేని సమయంలో, అతని ఆరోగ్యం పూర్తిగా విషమించి ఇక బతికే అవకాశం లేదని అనుకున్నప్పుడు ఆ కేసులను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించడం దారుణమైన విషయంగా పేర్కొన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వాసుపత్రులపై ఉన్న అపోహలు తొలగించుకోవాలన్నారు. లక్షలు లక్షలకు ఫీజులు చెల్లించి ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. కరోనాకు అవసరమయ్యే చికిత్స కు పది రోజులకు కూడా 10 వేలు మించవని అన్నారు.

ఇక రాష్ట్రంలో సరైన సౌకర్యాలు లేవని జరుగుతున్న ప్రచారాన్ని ఈటెల ఖండించారు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ కరోనా వైద్య కేంద్రాలు ఉన్నాయని, హైదరాబాద్‌లో కింగ్‌ కోఠి, చెస్ట్‌, సరోజిని,టిమ్స్‌, గాంధీ ఆసుపత్రులు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కరోనా ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరిపోయే బెడ్స్‌ ఉన్నాయని, ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని మంత్రి సూచించారు.

మన రాష్ట్రంలో ఆక్సిజన్, బెడ్ల కొరతగాని వెంటిలేటర్ల కొరత గాని లేదని స్పష్టం చేసారు. కరోనా రోగుల్లో కేవలం అత్యల్పకేసుల్లో మాత్రమే వెంటిలేటర్ అవసరం ఏర్పడుతుందన్నారు. అలాగే వైద్యులు, ఇతర సిబ్బంది కొరత కూడా లేదని తెలిపారు. ప్రజలు కచ్చితంగా కరోనా జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా కోసం ఏర్పాటు చేసిన పీహెచ్సి లలో కరోనా లక్షణాలు ఉన్న వారు సంప్రదించాలన్నారు.

కొందరు కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు ఉన్నా నిర్లక్షయంగా వ్యవహరించి ఆ విషయాన్ని తెలియజేయకపోవడంతో ప్రాణ నష్టం సంభవిస్తుందన్నారు. కరోనా బాధితుల నుండి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని ఇటీవల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈటెల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Related News