logo

  BREAKING NEWS

మే 15 లోపు వాట్సాప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకుంటే ఏమవుతుంది?  |   జ‌గ‌న్ – ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు 100 % నిజం.. ఇదే సాక్ష్యం  |   శ‌త్రువులు కూడా ఈ విష‌యంలో జ‌గ‌న్‌ను శ‌భాష్ అంటారు  |   కరోనాను అడ్డుకునే అస్త్రం అదొక్కటే.. శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు  |   శుభవార్త: తగ్గిన బంగారం ధరలు 16.04.2021 బంగారం, వెండి ధరలు  |   కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్ వీరిలోనే ఎక్కువ.. కారణం ఇదే  |   పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |  

అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన

ఏపీ రాష్ట్రం పీకల్లోతు అప్పుల ఊబిలో ఉందన్న కాగ్ నివేదికపై ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఈ శుక్రవారం విజయవాడలో బుగ్గన ఈ అంశంపై మాట్లాడుతూ.. అప్పులు చేసిన విషయం వాస్తవమేనని ఆ విషయాన్ని తమ ప్రభుత్వం గర్వంగా చెప్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఉందన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాయన్నారు.

కరోనా కారణంగా దేశమంతా తలకిందులైంది. అలాగే తమ రాష్ట్రం కూడా ఆర్థికంగా నష్టాలను చవిచూసిందన్నారు. ఆదాయం తగ్గిపోవడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. అయితే రాష్ట్రానికి రాబడి లేకున్నా ప్రజలు ఇబ్బందులు పడకూడదని జగన్ ప్రభుత్వం భావించింది. అందుకే అప్పులు చేయాల్సి వచ్చింది. అదే విధంగా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను దళారి వ్యవస్థలకు చోటు లేకుండా అందించామన్నారు.

ప్రజలు ఇబ్బందులో ఉన్నప్పుడు నగదును పంపింగ్ చేయడం ద్వారా తిరిగి అదే డబ్బు ఎకానమీలోకి వస్తుందని భావించామన్నారు. ఆ విషయాన్ని తాము గర్వంగా చెప్పుకుంటామన్నారు. 2020-21 తొలి క్వార్టర్స్ లో ద్రవ్యలోటు మైనస్ 12. 9 శాతం ఉండగా మూడో క్వార్ట్రర్స్ నాటికి మైనస్ 5, 5 కి చివరి క్వార్ట్రర్స్ లో మైనెస్ 3 శాతానికి తగ్గిందన్నారు. రాష్ట్ర అప్పులపాలైందని టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని బుగ్గన మండిపడ్డారు.

Related News