logo

  BREAKING NEWS

‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |  

శిరోముండనం బాధితుడికి సొంత ఇల్లు, ఉద్యోగం.. మంత్రి అవంతి ఆదేశాలు

విశాఖ శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌ను ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. ఆయనతో పాటుగా ఎమ్మెల్యే ప్రదీప్ రాజు ‌ఆదివారం బాధితుడి ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఆరా తీశారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదన్నారు.

బాధితుడికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితుడి కుటుంబ పరిస్థితిని మంత్రి అవంతి అడిగి తెలుసుకున్నారు. కాగా అతనికి తల్లిదండ్రులు కూడా లేరని ఎక్కడి నుంచో పొట్టచేత పట్టుకుని పని కోసం వచ్చాడని తెలుసుకుని చలించిపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్‌కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లు, ఔట్ ‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు

. మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్‌కు అందజేశారు. ఈ ఘటనకు కారణమైన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసారని మంత్రి అవంతి తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా తేలిన నూతన నాయుడు భార్య మధుప్రియ తో సహా వీరందరికి కోర్టు రిమాండు విధించింది.

Related News