ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ భారత్ లో తన కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కే పేరుతో లాంచీ చేసిన ఈ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు, ధర విషయాలను పరిశీలిస్తే.. 55 అంగుళాలతో ఉన్న ఈ టీవీ ప్రస్తుతం షియోమీ బ్రాండ్ లో అత్యంత ఖరీదైనది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్లలో డిసెంబర్ 21 నుంచి ఈ టీవీ సేల్ జరగనుంది.
ఎంఐ నుంచి వస్తున్న ఈ క్యూఎల్ఈడీ టీవీలో కేవలం 55 అంగుళాల వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది దీని ధర విషయానికొస్తే.. రూ.54,990గా ఉంది. ఇదే క్యూఎల్ఈడీ టీవీలు ఇతర కంపెనీలు రూ. 60 వేల రేంజ్ లో విక్రయిస్తుండటం విశేషం. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది.
ఇందులో అల్ట్రా హెచ్డీ క్యూఎల్ఈడీ స్క్రీన్‌ను అందిస్తున్నారు. హెచ్ఎల్జీ, హెచ్డీఆర్10, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ వంటి అన్ని హెచ్‌డిఆర్ ఫార్మాట్లను ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఎంటీ9611 ప్రాసెసర్ ను కలిగి ఉంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందిస్తున్నారు. మూడు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు కూడా లభిస్తాయి. 30W సౌండ్ అవుట్‌పుట్ సిస్టం ఉంది.