logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

MGNF-2021 నోటిఫికేషన్: నెలకు రూ. 60,000 ఫెలోషిప్.. అర్హతలు ఇవే!‌

విద్యార్థులకు, నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో అద్భుతమైన అవకాశం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మహాత్మా గాంధీ ఫెలోషిప్- MGNF కు సంబందించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఫెలోషిప్ కు ఎంపికయ్యే అభ్యర్థులకు దేశాభివృద్ధిలో తమవంతు సహకారం అందించే సువర్ణావకాశం లభిస్తుంది. రెండేళ్ల పాటు ఉండే ఈ ఫెలోషిప్ లో అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 50 వేలు రెండో ఏడాది నుంచి నెలకు రూ. 60 వేల స్టయిఫండ్ లభిస్తుంది.

కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్, ఆంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ దేశంలోని 69 జిల్లాల్లో ఈ పైలట్ పద్దతిని ప్రారంభిందించి. తాజాగా మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ ను ప్రారంభించింది. వరల్డ్ బ్యాంకు సహకారంతో సంకల్ప్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ఫెలోషిప్ లను అందిస్తుంది కేంద్రం. ఈ ఫెలోషిప్ కు ఎంపికయ్యే అభ్యర్థులకు దేశంలోనే అత్యత్తమమైన 9 ఐఐఎంలలో శిక్షణ ఇప్పిస్తారు. అందులో భాగంగా ఐఐఎం విశాఖపట్నం, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం లక్నో, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం ఉదయ్‌పూర్, ఐఐఎం నాగ్‌పూర్, ఐఐఎం రాంచీ, ఐఐఎం జమ్మూ, ఐఐఎం కోజికోడ్ ఈ ఫెలోషిప్ లను అందిస్తున్నాయి.

ఇందులో రెండు దశల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మొదటి దశలో ఐఐఎంలలో శిక్షణ, రెండో దశలో డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ, డిస్ట్రిక్ట్ స్కిల్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి పని చేసే అవకాశం లభిస్తుంది. ఈ ఫెలోషిప్ ద్వారా దేశంలోని స్కిల్ డెవలప్మెంట్ వ్యవస్థ, ప్రభుత్వం అందిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ కు సంబందించిన పరిజ్ఞానం పై శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు ప్రణాళికలను తయారు చేయవలసి ఉంటుంది. ఈ ఫెలో షిప్ పూర్తి చేసిన వారికి ఐఐఎం నుంచి సర్టిఫికెట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ మేనేజిమెంట్ లభిస్తుంది.

ఈ ఫెలోషిప్ కు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉండాలి. దేశవ్యాప్తంగా మొత్తం 660 ఫెలోషిప్ లు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. స్త్రీ, పురుష అభ్యర్థులు ఇద్దరూ అర్హులే. 3 సంవత్సరాల లోపు పై అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రీయ భాషలో అనర్గళంగా మాట్లాడటం, రాయడం, చదవడం తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అందులో జనరల్ అవేర్ నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్ ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, వెర్బల్ అబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. మార్చి 27 దరఖాస్తులకు చివరి తేదీ.

Related News