logo

  BREAKING NEWS

అన్న‌మ‌య్య జిల్లా పూర్తి వివ‌రాలు  |   తూర్పు గోదావ‌రి(రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) జిల్లా పూర్తి వివ‌రాలు  |   ఎన్‌టీఆర్ కృష్ణా జిల్లా పూర్తి వివ‌రాలు  |   శ్రీబాలాజీ తిరుప‌తి జిల్లా పూర్తి వివ‌రాలు  |   ఎంపీ ప‌ద‌విపై క‌న్నేసిన రాజాసింగ్‌.. అక్క‌డి నుంచి పోటీ  |   షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |  

మీ దగ్గర పల్స్ ఆక్సిమీటర్ లేదా?.. మీ స్మార్ట్ ఫోన్ తోనే ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకోండి

కరోనా కాలంలో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను కొలిచే పల్స్ ఆక్సిమీటర్ పరికరం ఎంత కీలకంగా మారిందో తెలిసిన విషయమే. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి లక్షణాలపై మరోసారి చర్చ జరుగుతుంది. కరోనా లక్షణాలు బయటకు కనిపించని పరిస్థితుల్లో రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవడం ద్వారా కూడా కరోనా సోకిన విషయాన్ని కనుక్కోవచ్చు. లక్షణాలు కనిపించకపోయినా ఆక్సిజన్ స్థాయిలు నిర్దిష్ట శాతంకన్నా తక్కువగా ఉంటే వారిని కూడా కరోనా సోకిన వ్యక్తులుగానే భావిస్తున్నారు.

సాధారణంగా రక్తంలోని ఆక్సిజన్‌ శాతం 95 శాతం కంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా పరిగణించవచ్చు… అదే 95 శాతం కన్నా తక్కువగా ఉంటే అసాధారణంగా పరిగణిస్తారు. 92 శాతం కన్నా తక్కువగా అంటే వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు ఎప్పటికపుడు తమ ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేసుకోవడం ద్వారా అప్రమత్తంగా ఉండవచ్చు. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఈ పరికరం అవసరాన్ని గుర్తించిన డిజిటల్ హెల్త్ స్టార్ట్ అప్ అనే సంస్థ ప్రతి ఒక్కరికీ దీనిని అందుబాటులో ఉంచాలనుకుంది.

అందుకోసం ‘ఎం ఫైల్స్’ అనే కొత్త టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ ఉండి బ్యాక్ కెమెరా, ఫ్లాష్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవ్వరైనా ఇకపై సులభంగా మీ ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. ఈ టూల్ తో మీ స్మార్ట్ ఫోన్ నే ఆక్సిమేటర్ గా మార్చేసుకోవచ్చు. అందుకోసం..

*ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి.
*’ఎం ఫైన్’ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
*మీ పేరు, ఫోన్ నంబర్ వివరాలను ఇచ్చి నమోదు చేసుకోవాలి.
*ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయినా పేజీలో మేజర్ యువర్ ఆక్సిజన్ లెవల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది
*ఆ ఆప్షన్ ను క్లిక్ చేసి ‘మెజర్’ అనే బటన్ పైన క్లిక్ చేయాలి.
*ఆ తర్వాత మీ చేతి వేలితో మీ ఫోన్ బ్యాక్ కెమెరాను మూసేయండి. అలా 20 సెకండ్ల పాటు ఉంచాలి
*ఆ తర్వాత వేలిని కెమెరా పై నుండి తీసేస్తే రెండు సెకండ్లలో మీ పల్స్ రేటు శాతాన్ని స్క్రీన్ మీద చూపుతుంది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ టూల్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఐవోఎస్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానుంది. అయితే, కరోనా సోకిన అందరిలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గకపోవచ్చని చెబుతున్నారు వెద్యులు. ఊపిరితిత్తులు, గుండె, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలున్నవారు మాత్రం ఆక్సిజన్‌ స్థాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్స్‌ ఆక్సిమీటర్‌ సహాయంతో రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయిలను రెగ్యులర్‌గా చెక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.

Related News