logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మెట్రోలో ప్రయాణిస్తున్నారా?… పొరపాటున అక్కడ కూర్చుంటే రూ. 100 ఫైన్!

హైద్రాబాద్ ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రోజురోజుకి మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. అదే సమయంలో మహిళా ప్రయాణికుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మహిళలకు ఇబ్బంది కలిగించే చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించడం లేదు. నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికులపై కొరడా ఝళిపిస్తున్నారు.

ఇకపై మెట్రోలో ప్రయాణించే పురుషులు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ జేబుకు చిల్లు పడినట్టే. మెట్రోలో సీట్లు ఖాలీగా ఉన్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి. ఎందుకంటే మహిళలకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే వారిని నెక్స్ట్ స్టేషన్లో దించేసి మరీ అధికారులు ఫైన్ విధిస్తున్నారు. పొరపాటున కూర్చున్నా కూడా రూ. 100 ఫైన్ కట్టాల్సిందే.

ఇలా పట్టుబడితే ఎన్ని కారణాలు చెప్పినా.. తమకు ఆ విషయం గురించి తెలియదని చెప్పినా అధికారులు వినిపించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఫైన్ విధించి రసీదు చేతిలో పెడుతున్నారు. అయితే ఈ రూల్ పై అవగాహన లేకపోవడం వలన చాలా మంది ప్రయాణికులు ఫైన్ కట్టి లబోదిబోమంటున్నారు. అందుకే మెట్రోలో ప్రయాణించే పురుషులు ఈ విషయాన్నీ గుర్తు పెట్టుకుంటే మంచిది.

Related News