logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన హైదరాబాద్ మెట్రో

లాక్ డౌన్ కారణంగా అన్ని సంస్థలకు భారీగా నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ప్రయాణికులు లేకపోవడంతో మెట్రో ఆదాయానికి కూడా భారీగానే కోత పడింది. దీంతో అన్ లాక్ ప్రక్రియ మొదలు కాగానే వినూత్న ఆఫర్లు, రాయతీలు ప్రకటించి ప్రయాణికులను ఆకర్షిస్తుంది హైదరాబాద్ మెట్రో.

ఇప్పటికే పండగ సందర్భంగా సువర్ణ పేరుతో 40 శాతం రాయితీని కల్పించగా మెట్రో ప్రయాణాలు 30 శాతం మేర పెరిగాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తాజాగా ఈసారి ఏకంగా ప్రయాణికుల కోసం 50 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది మెట్రో. మెట్రో స్మార్ట్ రీచార్జి చేసుకునే వారికి 50 శాతం(900 శాతం) క్యాష్ బ్యాక్ ఆఫర్ ను నేటి నుంచే ప్రారంభించింది. మెట్రో స్టేషన్లు, ఆన్లైన్ రీఛార్జులు చేసుకునే వారికి ఈ అఫర్ ను వర్తింపజేస్తున్నారు.

దీని ద్వారా లభించే క్యాష్ బ్యాక్ మొత్తం స్మార్ట్ కార్డులోనే జమ అవ్వనుంది. 90 రోజుల వ్యవధిలో దీనిని వినియోగించుకోవలసిందిగా సంస్థ ఎండి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మెట్రోసేవలు వినియోగించుకోవడానికి ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారన్నారు. నగరంలో ఉన్న మూడు మెట్రో కారిడార్లలో కలిపి రోజుకి 1. 30 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నటుగా తెలిపారు.

Related News