logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

భర్తను వదిలి కొడుకును పెళ్ళి చేసుకున్న సోషల్ మీడియా స్టార్

తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన కొడుకుతో కలిసి గర్భం దాల్చడమే కాకుండా పెళ్లి చేసుకుని ఓ మహిళ సంచలనం సృష్టించింది. రష్యాకు చెందిన సోషల్ మీడియా స్టార్ మెరీనా బల్మశేవా.. అలెక్సీ(45)ను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకున్నారు.

దాదాపు 13 సంవత్సరాల పాటు వారి వైవాహిక జీవితం కలిసే కొనసాగించారు. అయితే అలెక్సీకి మెరీనా కు మధ్యన మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. వీరి పిల్లల బాధ్యతను కోర్టు తండ్రికి అప్పజెప్పింది. వీరిలో వ్లాదిమిర్ వోయా(20) ఏడేళ్ల వరకు పిన తల్లి వద్ద పెరిగాడు. ఆమె కూడా అతని ఆలనా పాలనా చూసింది. ఆ తర్వాత అతను చదువు నిమిత్తం వెళ్లి 19 ఏళ్ల వయసులో ఇంటికి తిరిగొచ్చాడు. అదే సమయంలో వ్లాదిమర్ కు పెంచిన తల్లిపై ప్రేమ పుట్టింది.

మెరీనా కూడా కొడుకు వ్లాదిమిర్‌తో ప్రేమాయణం నడిపి బిడ్డకు జన్మనివ్వబోతోంది. కాగా ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమె ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచగా వైరల్ గా మారాయి. దీనిపై మెరీనా స్పందిస్తూ .. నా సొంత బిడ్డకు జన్మనివ్వాలని ఆశపడ్డానని, కానీ నా భర్త నుంచి అది పొందలేకపోయానని చెప్పింది. కాగా ఇది తన వ్యక్తిగత విషయంగా పేర్కొంది. ఆమె భర్త మాత్రం తన కొడుకుకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Related News