logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

ట్రంప్ తో మొలనియా విడాకులు.. భరణంగా ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాకే!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు ట్రంప్. ఇప్పుడు ట్రంప్ సతీమణి ఆయనతో విడిపోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ వైట్ హౌస్ నుంచి బయటకు రాగానే మెలానియా ఆయనతో వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

ఈ విషయంపై ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అవసరం కోసమే వారిద్దరూ ఒక దగ్గర కాలం గడుపుతున్నారని అధ్యక్ష పదవి పోగానే ట్రంప్ కు ఆమె విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ చెప్పినట్లుగా డైలీ మెయిల్ ప్రచురించింది. కాగా మెలానియా ట్రంప్ కు మూడో భార్య.

వీరిద్దరికి 14 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు బారన్ ట్రంప్. ట్రంప్ మొదటి ఇద్దరు భార్యలతో విడిపోయిన సమయంలో వారికి ఒప్పందం ప్రకారం భారీ మొత్తాన్ని ముట్టజెప్పారు. ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కు 14 మిలియన్ డాలర్లు ఇవ్వగా, రెండో భార్య మార్లా మాపుల్స్ కు 1 మిలియన్ డాలర్లను ఇచ్చారు. దీనితో పాటుగా పాటుగా ఇతర సదుపాయాలను కూడా కల్పించారు.

కాగా ఇప్పుడు వీరందరికన్నా మెలానియా కళ్లుచెదిరే మొత్తాన్ని పొందనున్నారనే ప్రచారం జరుగుతుంది. విడాకుల ఒప్పందం ప్రకారం మెలానియా 68 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 500 కోట్లపైమాటే) పొందనున్నారట. ఇది భారీ మొత్తమంటూ ఈ సందర్భంగా న్యూమాన్ పేర్కొన్నారు. అయితే తన కుమారుడికి కూడా ట్రంప్ మిగిలిన కుమారుల్లాగే అన్ని వారసత్వపు హక్కులు వచ్చేలా మెలానియా ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారట.

కాగా వీరిద్దరూ 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం మెలానియా అమెరికా మొదటి మహిళగా కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ డబ్బుతో ఆమె న్యూయార్క్ లో విలాసవంతమైన జీవితం గడపనున్నారట.

Related News