నాచురల్ స్టార్ నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది మెహ్రీన్ పీర్జాదా. ఆ సినిమాలో ఆమె క్యూట్ నటనకు తెలుగు కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగు తమిళ భాషలో అనేక సినిమాల్లో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమాలో హానీ ఈజ్ ద బెస్ట్ అంటూ అల్లరి చేసింది.
ఇప్పుడు ఈ బ్యూటీ పెళ్లిపీటలెక్కేందుకు సిద్దమవుతుంది. మాజీ సీఎం మనవడితో మెహ్రీన్ పెళ్లి అంటూ నాలుగు రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలపై మెహ్రీన్ స్పందించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలు నిజమేనని క్లారిటీ ఇచ్చింది. మెహ్రీన్ కాబోయే భర్త ఎవరో కాదు హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో ఈ ముద్దుగుమ్మ ఏడడుగులు వేయనుంది.
రాజస్థాన్ లోని జైపూర్ అలీల కోటాలో వీరిద్దరి నిశ్చితార్థం మార్చి 13 న జరగనుంది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టనుండటం పట్ల మెహ్రీన్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ లో మెహ్రీన్ నటిస్తుంది. కాగా ఈ కాబోయే జంటకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.