ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ విజేతగా హీరో అభిజిత్ నిలిచాడు. రన్నర్ అప్ గా అఖిల్ నిలిచాడు. టాప్ త్రీ కంటెస్టెంట్లలో అభిజిత్, అఖిల్, సోహైల్ నిలువగా వారికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. టైటిల్ విన్నర్ పోటీ నుంచి తప్పుకున్నవారికి రూ. 25 లక్షల ప్రైజ్ మనీని ఆఫర్ చేసాడు.
దీంతో అభిజిత్, అఖిల్ ట్రోఫీ కోసం పోటీ పడగా సోహైల్ మాత్రం రూ. 25 లక్షలు తీసుకుని రేసులో నుంచి తప్పుకున్నాడు. నిజానికి సోహైల్ టాప్ 3 కంటెస్టెంటు గా ఉన్నాడు. అభిజిత్ మొదటి స్థానంలో ఉండగా అఖిల్ కు రెండో స్థానం ఎప్పుడో కన్ఫర్మ్ చేసారు ప్రేక్షకులు. అయితే ఇదంతా తెలియకపోయినా సోహైల్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడని అతన్ని అభినందించారు.
కానీ తాజాగా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. తన పొజిషన్ టాప్ 3 అని సోహైల్ కు ముందుగానే తెలుసన్న విషయం ఈ వీడియో చుసిన వారికి అర్థమైపోతుంది. గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన టాప్ 5 కంటెస్టెంట్లను మాజీ కంటెస్టెంట్లు కలుసుకునే విధంగా బిగ్ బాస్ ఏర్పట్లు చేసిన విషయం తెలిసిందే.
ఈ షోలో భాగంగా మిగతా కంటెస్టెంట్లతో పాటుగా మెహబూబ్ కూడా వచ్చాడు. ఆ సమయంలో అతను సోహైల్ కు ఏవో సైగలు చేసాడని, మూడు వేళ్ళు చూపిస్తూ హింట్ ఇచ్చాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అందుకే తెలివిగా సోహైల్ రూ. 25 లక్షలు ఎగరేసుకువెళ్లాడని ఆరియానా, హరికలకు ఎలాంటి ప్రైజ్ మనీ అందలేదని వారి అభిమానులు మెహబూబ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెహబూబ్ హౌస్ లోకి వెళ్లిన నాటి నుంచి ఇలాగే దూకుడుగా వ్యవహరించాడని కామెంట్లు చేస్తున్నారు