logo

  BREAKING NEWS

నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |  

రాజకీయాలపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు.. మళ్ళీ జన్మంటూ ఉంటె..

తెలుగు తెరపై మెగాస్టార్ గా ఓ వెలుగువెలిగిన చిరంజీవి ఆ తర్వాత ప్రజల్లో తనకున్న క్రేజ్ తో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ ని కూడా స్థాపించారు. కానీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం సృష్టిస్తారని అనుకున్న అభిమానులకు షాకిస్తూ కేవలం 18 సీట్లకు ఆ పార్టీ పరిమితమైంది. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

కొన్నేళ్లపాటు రాజ్య సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కూడా అయన పనిచేసారు. తర్వాత క్రమంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే తాజాగా చిరు తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇటీవల సమంత హోస్ట్ గా సామ్ జామ్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.

అందులో పాల్గొన్న చిరంజీవిని రాజకీయాల్లోకి వెళ్లిన మీరు మళ్లీ సినిమాల్లోకి రావడానికి గల కారణం ఏమిటని సమంత ప్రశ్నించింది. అందుకు బదులిస్తూ.. తనకు రాజకీయాలు సెట్ కావని అన్నారు. రాజకీయాల్లో ఉన్న పదేళ్ల కాలంలో తాను చాలా నేర్చుకున్నానన్నారు. తనకు ప్రస్తుతం రాజకీయాల పై ఎలాంటి ఆసక్తి లేదన్నారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కష్టపడుతున్నాడని త్వరలోనే మంచి ఫలితాన్ని అందుకోవాలని భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఇక తనకు మళ్ళీ జన్మంటూ ఉంటె నటుడిగానే కొనసాగుతానని అన్నారు. మెగాస్టార్ అభిమానులంతా పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతున్న వేళ తనకు మాత్రం జనసేన పార్టీలో చేరడంపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేసారు. తాను ఎప్పటికీ మెగాస్టార్ గానే ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

Related News