logo

  BREAKING NEWS

అయోధ్య మసీదుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!  |   మహారాష్ట్ర – కర్ణాటకకు మధ్య ఏమిటీ ‘బెల్గాం’ వివాదం?  |   తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక ? ఆ ఎమ్మెల్యే రాజీనామా ఖాయం..?  |   మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి చిరంజీవి..? త‌మ్ముడి వెంట అన్న..?  |   బైడెన్ సంచలన నిర్ణయం.. ప్రవాస భారతీయులకు భారీ ఊరట!  |   పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |  

మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టాలెంటెడ్ హీరో.. !

మళయాళస్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయబోతున్నారు. ఎంతో మంది దర్శకుల పేర్లను పరిశీలించిన అంతరం గతంలో తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ సినిమాను తెరకెక్కించి ప్రస్తుతం తమిళ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న దర్శకుడు మోహన్ రాజాకు ఈ సినిమా రీమేక్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. తెలుగులో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ టాలెంటెడ్ హీరోగా మారిన సత్యదేవ్ చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు. ఈ విషయాన్నీ సత్యదేవ్ తెలియజేస్తూ చిరుతో తీసుకున్న ఓ ఫోటోను ట్వీట్ చేసాడు. ‘థాంక్స్ అన్నయ్య’ అంటూ తన సంతోషాన్ని తెలియజేసాడు.

కాగా మలయాళం లూసిఫర్ లో హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ చేసిన కీలక పాత్రలో సత్యదేవ్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఈ ఫోటో ఇంటర్ నెట్ లో వైరల్ గ మారింది. కాగా ప్రస్తుతం చిరంజీవి కొరత శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా తరువాత చిరు లూసిఫర్ రీమేక్ తో పాటుగా మరో రెండు సినిమాలు చేయబోతున్నాడు.

 

Related News