logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

శర్వానంద్ సినిమాకు ‘మెగా’ గ్లామర్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

ఓ యువ హీరో కోసం మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ చేసిన చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు టాలీవుడ్ లో జరిగే సినిమా ఫంక్షన్లకు హాజరవుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్నారు. సినిమా పై ఆయన చెప్పే మాటలతో సినిమా యూనిట్ లో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా మరో యువ హీరో కోసం చిరంజీవి నడుం కట్టారు.

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’ సినిమా విడుదల కు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ఈవెంట్ ను ఖమ్మ జిల్లాలో ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా శర్వా వెల్లడించాడు. ఆయనతో పాటుగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం.

మార్చి 11 న శివరాత్రి స్పెషల్ గా ఈ సినిమా విడుదల కానుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్న చిరు ఈ ఫంక్షన్ కు హాజరైన తనదైన శైలి స్పీచులతో ఆకట్టుకోనున్నారు. దీంతో ఆ సినిమాకు ఎక్కడ లేని హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు శర్వా సినిమాకు కూడా మెగా గ్లామర్ తోడవుతుండటంతో ఈ హీరో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా శ్రీకారం సినిమా ద్వారా కిషోర్ రెడ్డి అనే దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. ప్రియా అరుళ్ మోహన్ శర్వాకు జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే జిల్లాలోని మమతా హాస్పిటల్ గ్రౌండ్ లో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాసులు ఉన్న వారినే అనుమతిస్తామని ఈవెంట్ మేనేజిమెంట్ శ్రేయాస్ మీడియా తెలిపింది.

Related News