logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

త్రిష వీడియోలు బయటపెడతా.. నటి సంచలన వ్యాఖ్యలు

కొందరికి అందం అభినయం ఉన్నా సినీ పరిశ్రమలో నెట్టుకు రావడం కష్టమవుతుంది. టాలెంట్ ఉండి, కష్టపడే తత్త్వం ఉన్నా అవకాశాలు లేని వారు కూడా కోకొల్లలు. అయినా తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ తమిళ నటి మీరా మిథున్ మాత్రం కేవలం కాంట్రావర్సీలతోనే అవకాశాలు వస్తాయని అనుకుంటుందో ఏమో. తరచూ ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటుంది.

2016లో ఫెమీనా మిస్‌ సౌత్‌గా కిరీటాన్ని గెలుచుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత పలు వివాదాలతో ఆ కిరీటం కోల్పోయింది. కాగా ‘8 తూట్టాగల్‌’ చిత్రంలో కథానాయక నటించిన మీరా మిథున్‌ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రల్లో నటించడంతో ఎవరూ పట్టించుకోలేదు. అయితే బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌షో లో పాల్గొని మరోసారి వివాదాలకు కేంద్రంగా మారింది.

ఆ గేమ్‌ షోలో నటుడు, దర్శకుడు చేరన్‌ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు గుప్పించడంతో పాటు ఆ షోకు వ్యాఖ్యాతగా బాధ్యతలు నిర్వహించిన కమల్ హాసన్‌ను ఈ అమ్మడు వదల్లేదు. తమిళ సూపర్ స్టార్ విజయ్, రజనీకాంత్ లపై కూడా విమర్శలు చేయడంతో వారి అభిమానుల ఆగ్రహానికి గురైంది. తాకగా ఆమె చెన్నై బ్యూటీ త్రిష పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

కోలీవుడ్ లో ఓ నటీమణి సుమారు 5. 5 ఇంచులు ఉంటుంది. మిస్ చెన్నై కిరీటాన్ని కూడా ధరించింది. చిన్న చితకా వేషాలు వేసుకునేది. కింగ్ ఫిషర్ మాడల్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అభద్రతా భావంతో బాధపడే ఆమె కోలీవుడ్ మాఫియాతో చేతులు కలిపింది. ‘ఎన్నై అరిందల్’ చిత్రం నుంచి నన్ను తప్పించింది. ఈ సినిమా నుంచి నన్ను తొలగించడంతోనే త్రిష పనులు ఆగిపోలేదు. ‘పెట్ట’ సినిమా నుంచి కూడా నన్ను తప్పించింది. త్రిషకు సంబంధించిన వీడియోను రేపు బయటపెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. .

Related News