logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

ఏపీ సీఎం జగన్ కు మీరా చోప్రా ఫిర్యాదు..!

ఎన్టీఆర్ అభిమానులు తనపై వేధింపులకు పాల్పడుతున్నానంటూ హైదరాబాద్ పోలీసులకు మీరా చోప్రా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలంటూ ఆమె డిమాండ్ చేసారు కూడా. తాజాగా మరోసారి మీరా చోప్రా ఎన్టీఆర్ అభిమానులపై మండిపడ్డారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా తనపై వేధింపులు ఆపడం లేదని అన్నారు.

ఈ విషయాన్నీ ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ అభిమానులు తనను వేధిస్తున్నారని అందులో ఏపీ రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ విషయాన్నీ ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంటూ సీఎం జగన్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ మంత్రి తానేటి వనితను ట్విట్టర్ లో టాగ్ చేసారు. తనను గ్యాంగ్ రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్ పోలీసులకు ఈ విషయం పై ఫిర్యాదు చేసానని వారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు.
మహిళలపై వేధింపులు, నేరాలను అరికట్టడానికి సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు మీరా చోప్రా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Related News