logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఎన్టీఆర్ అభిమానులు వేధిస్తున్నారు: మీరా చోప్రా

సోషల్ మీడియాలో నటీమణులకు వేధింపులు సర్వసాధారణంగా మారాయి. కొందరు వీటిని మౌనంగా భరిస్తే మరికొందరు మాత్రం ఇలాంటివి సహించబోమని తేల్చి చెబుతున్నారు. ఇలాగే సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే నటీమణుల్లో మీరా చోప్రా ఒకరు. ఇటీవల ఆమె #askmeera వేదికగా ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించారు. అయితే ఓ నెటిజన్ మీ ఫెవరెట్ హీరో ఎవరు అని అడగగా మీరా చోప్రా మహేష్ బాబు అని సమాధానం ఇచ్చారు.

మరో వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ పై మీ అభిప్రాయం ఏమిటని అడగగా నాకు అతని గురించి తెలియదు ఎందుకంటే నేను ఎన్టీఆర్ అభిమానిని కాదు అని అన్నారు. ఈ సమాధానం కొంతమందికి అసహనం తెప్పించింది. వారంతా ఆమెపై అసభ్య పదజాలంతో దూషిస్తూ ట్వీట్లు చేసారు. దీంతో మీరా చోప్రా ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ కు ట్వీట్ చేసారు.

‘మీ అభిమానులు నాపై బెదిరింపులకు దిగుతున్నారు. నన్ను గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇదంతా కేవలం నేను మహేష్ బాబు అభిమానిని అని చెప్పినందుకే ఇలాంటి అభిమానులు ఉండటం వల్ల మీరు సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారా? మీరు కచ్చితంగా ఈ విషయంపై స్పందించాలి’ అంటూ ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మరోవైపు సదరు నెటిజన్ల ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసి ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్నీ ఆమె ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్తు ‘ఈ ట్వీట్లను గమనించండి దయచేసి ఇలాంటి వారి అకౌంట్లను ట్విట్టర్ నుండి తొలగించండి’ అని ఆమె కోరారు.

Related News