logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

మేడ్చల్ లో దారుణం: ప్రియుడి కోసం భర్త దారుణ హత్య.. రోడ్డు ప్రమాదంగా డ్రామా

మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిందో ఇల్లాలు. ఈ నెల 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని సైదోని గడ్డ తండాకు చెందిన బబితకు అదే ప్రాంతానికి చెందిన సురేష్ తో వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు సంతానం ఉన్నారు. సురేష్ శామీర్ పెట్ లోని ఓ ఫామ్ హౌస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బబిత కొంతకాలంగా దుండిగల్ కు చెందిన ప్రేమ్ సింగ్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.

అందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సంవత్సర కాలంగా ప్రియుడితో కలిసి పథకం వేస్తుంది. ఈ నేపథ్యంలో సురేష్ పై అడపా దడపా దాడులు జరిగాయి. కానీ అతను తప్పించుకోగలిగాడు. ఈసారి ఎలాగైనా భర్తను మట్టుబెట్టాలనుకున్న బబిత ప్రియుడు ప్రేమ్ సింగ్ తో కలిసి భారీ ప్లాన్ వేసింది. ఈ నెల 23న సురేష్ విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో వెనకనుంచి వచ్చిన డీసీఎం వాహనంతో అతన్ని అతన్ని ఢీ కొట్టించింది.

ఈ ఘటనలో సురేష్ రోడ్డుపై పడి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు చూసి ఆసుపత్రికి త్తరలించే ప్రయత్నం చేసారు. అదే సమయంలో ప్రియుడితో కారులో వచ్చిన బబిత ఇతను మా వాడే అని ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుండి సురేష్ ను కారులో తీసుకెళ్లింది. మార్గమధ్యంలో కొనప్రాణాలతో ఉన్న సురేష్ ను గొంతు నులిమి హత్య చేసింది.

అనంతరం రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయినట్టు చిత్రీకరించింది. సురేష్ కుటుంబం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బబితను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో భర్తను ప్రియుడి సాయంతో తానే హత్యచేసినట్టుగా అంగీకరించింది. బబితను, ప్రియుడు ప్రేమ్ సింగ్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. బబిత చేసిన పనికి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.

Related News