logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

సైన్యానికి భయపడి భారత్ కు పారిపోయి వస్తున్న పోలీసులు: మయన్మార్ లో అసలేం జరుగుతుంది?

మయన్మార్ లో ఆంగ్ సాంగ్ సూకీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన సైన్యం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ నాయకులను, పౌరులను గృహనిర్బంధం చేసింది. ఈ చర్యలపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాయా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తిరుగుబాటు చేసేవారిని భయబ్రాంతులకు గురి చేసేందుకు అక్కడి సైన్యం అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడుతుంది. అయినా మయన్మార్ ప్రజలు తమ నిరసనలను ఆపడం లేదు.

దీంతో గడిచిన పది రోజులుగా మయన్మార్ లో సైనిక తిరుగుబాటు రక్తపాతాన్ని సృష్టిస్తుంది. ఇప్పటి వరకు వందల మంది పౌరులు, చిన్నారులు చనిపోయారు. మరికొందరు కనిపించకుండా పోయారు. చిన్నారులను ఇళ్లలోకి దూరి మరీ చంపుతుంది అక్కడి సైన్యం. కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి పడేస్తుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 13 ఏళ్ల బాలికను, ఇంట్లో నిద్రిస్తున్న ఏడాది వయసున్న చిన్నారిని కూడా వదలకుండా సైనికులు పొట్టనబెట్టుకున్నారు. కాల్పులకు భయపడి తండ్రి దగ్గరకు పరిగెసుతున్న చిన్నారిని పై కాల్పులు జరపడం అక్కడి సైన్యం క్రూరత్వానికి నిదర్శనం.

మయన్మార్ లో సైన్యం సృష్టిస్తున్న ఈ మారణ కాండపై అంతర్జాతీయ సమాజం భగ్గుమంటుంది. చిన్నారులు ఈ హింసకు బలవుతుండటం పట్ల మానవ హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రజలను కాల్చి చంపాలన్న సైన్యం ఆదేశాలకు అక్కడి పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. ప్రజలతో పాటుగా నిరసనలకు దిగారు. తాజాగా సైన్యానికి పోలీసులకు మధ్య కాల్పులు జరగడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అయితే సైన్యం చర్యలకు భయపడి ప్రజలతో పాటుగా అక్కడి పోలీసులు కూడా పారిపోయి భారత్ కు వస్తుండటం గమర్హం. పోలీసులు అక్రమంగా భారత సరిహద్దుల నుంచి మన దేశంలోకి చొరబడి వచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి. ఇలా వస్తున్న వారిపై భారత ప్రభుత్వం అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. వారి ఆరోగ్యం, ఇతర అవసరాలను గుర్తించి ఆదుకుంటుంది.

Related News