logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

చిట్టీల పేరుతో కోట్లు దండుకుని.. దంపతుల పరార్

నమ్మకంగా ఉంటూ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న దంపతులను నమ్మి చిట్టీలు కడితే ఏకంగా 4 కోట్లకు ఎగనామం పెట్టి పరారయ్యారు. గుడివాడ కు చెందిన లక్ష్మణ రావు దంపతులు కొంత కాలంగా స్థానికంగా 35వ వార్డులో నివాసముంటున్నారు. స్థానికులతో నమ్మకంగా ఉంటూ మొదట పది వేల రూపాయల చిట్టీల వ్యాపారం ప్రారంభించారు.

ఆ తర్వాత పది వేలు, యాభై వేలు, లక్ష ఇలా మొత్తం 5 లక్షల వరకు చిట్టీలు కట్టించుకున్నారు. మధ్యతరగతి వారు, ఉద్యోగస్తులు తమ కష్టాన్ని చీటీల రూపంలో వీరికి ముట్టజెప్పారు. ఇలా నాలుగేళ్లు బాగానే వ్యాపారం సాగించారు. కానీ కొంత కాలంగా చిట్టీ డబ్బులు వసూలు చేయడం తిరిగి ఇవ్వాల్సిన వారిని తిప్పించుకోవడం చేయడం వంటివి చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. హఠాత్తుగా నెల రోజుల నుంచి లక్ష్మణరావు ఇంటికి తాళం వేసి ఉండటం, దంపతులు జాడ లేకుండా పోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.

దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఘొల్లుమన్నారు. పిల్లల పెళ్లిళ్లు, పై చదువులు, వైద్యం కోసం దాచుకున్న డబ్బును ఇలా మోసం చేసి ఎత్తుకెళ్లారని రోదిస్తున్నారు. ఈ ఘటనతో గుడివాడలో స్థానికంగా కలకలం రేగింది. బాధితులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై కేసు నమోదు చేసుకునం పోలీసులు నిందితులను పట్టుకుని తీరుతామని హామీ ఇచ్చారు.

Related News