logo

  BREAKING NEWS

విషాదం: కరోనా భయంతో నవ వధువు ఆత్మహత్య..!

కరోనా సోకిందని భయం ఓ నవవధువును బలి తీసుకుంది. కరీం నగర్ జిల్లాలో సోమవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బొంకూర్ గ్రామానికి చెందిన మాదాసు మల్లేశం–సత్తవ్వ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్న కూతురు నారా మేఘన (22) భీ ఫార్మసీ చదువుకుంటుంది. రెండు నెలల క్రితమే ఆమెకు ధర్మారానికి చెందిన మధు సూధన్ కి ఇచ్చి వివాహం జరిపించారు.

పెళ్ళైన తర్వాత వీరిద్దరూ హైదరాబాద్ లో నివాసముంటున్నారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు. మేఘనకు ఇటీవల జ్వరం వస్తుండటంతో భర్త మధు సూధన్ ఆమెను జగిత్యాల లోని ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. కాగా మేకు కరోనా లక్షణాలేమీ లేవని వైద్యులు చెప్పారు. కరోనా లక్షణాలేమీ లేకపోయినా తిరిగి వెళ్లే క్రమంలో మేఘనను భర్త తల్లిగారింట్లో వదిలి వెళ్ళాడు.

ఆదివారం పుట్టింటికి చేరుకున్న మేఘన ఎప్పటిలాగే కుటుంబసభ్యులతో గడిపింది. కాగా సోమవారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్రలేచి చూసేసరికి కూతురు ఉరికి వేళ్ళాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

కాగా మేఘనాకు అత్తింటి నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి గాని ఎలాంటి ఇబ్బందులు లేవని కేవలం కరోనా సోకిందని భయంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి పోలీసులకు తెలిపాడు. కాగా మృతురాలు టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెళ్ళైన రెండు నెలలకే మేఘన ప్రాణాలు వదలడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Related News