logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర:‌ 1-03-2021 బంగారం ధ‌ర‌లు..!

దేశంలో పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరుగుతున్న వేళ దిగొస్తున్న బంగారం ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తున్నాయి. ఆగస్టు మొదటి వారం నుంచి బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడం, బిట్ కాయిన్లపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరుగుతుండటం వంటి కారణాలతో పసిడి ధరలు భారీగా తగ్గుతున్నాయి.

ఇవాళ సోమవారం అంటే మార్చి 1న బంగారం ధ‌రలు స్వ‌ల్పంగా త‌గ్గాయి. ముందుగా హైద‌రాబాద్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,270 పడిపోయింది. దీంతో రేటు రూ.46,570కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.1160 తగ్గుదలతో రూ.42,690కు దిగొచ్చింది.

విజ‌య‌వాడ, విశాఖలో సైతం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 4331 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,570 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 తగ్గింది. తులం బంగారం కావాలంటే దాని ధర రూ.37,256 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.8 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,657 ఉంది.

కాగా, వెండి ధరల్లో నిన్నటికీ ఈరోజుకి మార్పు ఏమీ లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 75, 500 గా ఉంది. అదే తులం వెండి ధర రూ. 580 గా ఉంది. ఒక్క గ్రాము వెండి కొనాలంటే దాని ధర రూ. 72. 52 పైసలుగా ఉంది. గత నెల ఫిబ్రవరి ఒకటవ తేదీన వెండి ధర అత్యధికంగా రూ.79,200 ఉంది. దానితో పోలిస్తే ఈరోజు వెండి ధరలు తక్కువగానే ఉన్నట్టు లెక్క. బంగారం, వెండి కొనేవారు ఎప్ప‌టిక‌ప్పుడు ధ‌ర‌ల‌ను ప‌రిశీలించుకొని నిర్ణ‌యం తీసుకోవాలి. మార్కెట్ ధ‌ర‌లు నిత్యం మారుతూ ఉంటాయి.

 

 

Related News