logo

  BREAKING NEWS

మీరు దేశానికి ప్రధాని.. జాగ్రత్తగా వ్యవహరించండి : మన్మోహన్ సింగ్

భారత్ లోకి ఎవరూ చొరబడలేదని, ఎలాంటి ఆక్రమణలు జరగలేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బార్డర్ లోకి ఎవరు చొరబడకపోతే మరి మన జవాన్లు ఎలా మరణించారు? వారు ఎక్కడ చంపబడ్డారు? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభించింది.

తాజాగా ప్రధాని వ్యాఖ్యలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ ప్రకటనలు చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని అయన సూచించారు. సైనికుల మరణాలను తేలికగా తీసుకోవడం సరికాదన్నారు. అలా చేస్తే ప్రజలకు చారిత్రక మోసం జరిగినట్లే అని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. దేశ సమగ్రత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. ఈ మేరకు అయన ఓ ప్రకటన విడుదల చేసారు.

కాగా అఖిలపక్ష సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. ” గాల్వాన్ లోయ, పాంగ్వాంగ్ సరస్సు వద్ద జరిగిన ఉద్రిక్తతల్లో భారత సరిహద్దుల్లోకి ఎవరూ రాలేదు. మన పోస్టులను ఎవరూ ఆక్రమించలేదు ఎలాంటి చొరబాట్లు జరగలేదని ప్రధాని మోడీ ప్రకటించారు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా మన్మోహన్ సింగ్ కూడా మోడీపై విమర్శలు చేయడం గమనార్హం. .

Related News